బిగ్ బాస్ సీసన్ 5 టైటిల్ రేస్‌లో దూసుకుపోతున్నాడు షణ్ముఖ్ జస్వంత్ టాస్కుల పరంగా సరైన పెర్ఫార్మన్స్ లేకపోయినప్పటికీ క్రేజ్ పరంగా ఓట్లను బాగానే రాబడుతున్నాడు షణ్ముఖ్ జస్వంత్, ఆదివారం నాటి ఎనిమిదవ నామినేషన్ ప్రక్రియ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ నామినేషన్స్ లో భాగంగా షణ్ముఖ్ జస్వంత్ తన తల్లి ఉమారాణి గురించి ఎలా ఎమోషనల్ గా మాట్లాడారో అమ్మ కాన్సర్ ని తట్టుకున్నావ్ అమ్మమ్మ చనిపోతే తట్టుకున్నావ్ నువ్వే నా ఇన్స్పిరేషన్ నేను తట్టుకుంటా అని ఎమోషనల్ అయ్యారు దీనితో షణ్ముఖ్ జస్వంత్ తల్లి ఉమారాణి గారి పేరు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది, కాగా షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న విష్యం తెలిసిందే వీరు ఇద్దరు డీప్ గా ప్రేమలో ఉంటూ టాటూ లు కూడా వేయించుకున్నారు. ఇక షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున తో పాటు మొన్న ఎలిమినేట్ అయినా ప్రియా దీప్తి సునైనా గురించి ప్రస్తావిస్తూ షణ్ముఖ్ జస్వంత్ ని ఆటపట్టించారు.

ఇక షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఇంట్లో ఉంటె బయట దీప్తి సునైనా ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ షణ్ముఖ్ జస్వంత్ ని బిగ్ బాస్ విన్నర్ గా చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. మొత్తం గా ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడం తో అసలు వీళ్ల ఇంట్లో విష్యం తెలుసా, ఇంతకీ షణ్ముఖ్ జస్వంత్ తల్లిదండ్రులు కి దీప్తి సునైనా ని కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా అంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేసారు షణ్ముఖ్ తల్లి ఉమారాణి, దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ మంచి స్నేహితులు వాలా ఇద్దరి పెయిర్ కి మంచి పేరు క్రేజ్ ఉంది, వీళ్ల ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్స్ చేసారు వీళ్ల ఇద్దరికీ ఇష్టం అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

మా రెండు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని వాలా ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తాం పెద్ద వయసు కూడా కాదు వాళ్ళది అంత ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం, షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉన్నారో ఇంట్లో కూడా అలానే ఉంటారు యాక్టీవ్ గా ఉంటారు కానీ జోక్స్ గట్టిగానే వేస్తారు గొడవలు పెట్టుకునే రకం కాదు సిరి , షణ్ముఖ్ లు కలిసి గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు కానీ వాలా ఇద్దరు ఒకే చోట కలిసి పని చేసేవాళ్ళు వెబ్సెరీస్ కూడా చేసారు దానివల్లే వీలు ఒక చోట నుండి వచ్చారు కలిసి గేమ్ ఆడుతున్నారు అని చాలామందికి అనిపించవచ్చు కానీ కలిసి గేమ్ ఆడుదాం అనే అభిప్రాయం అయితే వాళ్ళది కాదు ఎవరి గేమ్ వాళ్ళది అది తరువాతనే తెలుసుకుంటారు. బిగ్ బాస్ నుండి షణ్ముఖ్ కి ఫోన్ రావడం ఇదే తొలిసారి బిగ్ బాస్ సీసన్ 4 కి కూడా షణ్ముఖ్ పేరు వినిపించింది కానీ నిజం కాదు. షణ్ముఖ్ చేసే వీడియోస్ కి పెద్ద హీరోలు చేసే వీడియోస్ కంటే ఎక్కువగా వ్యూస్, లైక్స్ వస్తుంటాయి అంతలా యూట్యూబ్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు తన షార్ట్ ఫిలిమ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ట్రేండింగ్ లో మొదటి స్థానం లో ఉంటారు తన డాన్సులతో, షార్ట్ ఫిలిమ్స్ తో అక్కటుకుంటారు, అతను చేసిన షార్ట్ ఫిలిమ్స్ అన్నిట్లో కంటే ది సాఫ్ట్వేర్ డెవలపర్ అనే సిరీస్ కి మంచి పేరు వచ్చింది అలానే సూర్య సిరీస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆ సిరీస్ తో తన క్రేజ్ పెరిగిందని చెప్పచు. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం ద్వారా ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది టైటిల్ విన్నర్ అని అంటున్నారు కానీ ఎవరు గెలుస్తారు అనేది అపుడే చెప్పలేం గెలుస్తారని అందరు అంటున్నారు కాబట్టి చాలా సంతోషం గా ఉంది అని షణ్ముఖ్ జస్వంత్ తల్లి ఉమారాణి చెప్పుకొచ్చారు.