తనకు కాబోయే భర్త రొమాంటిక్‌గా ఉండాలని నా దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేదు’ అని కథానాయిక రష్మిక అంటున్నారు. ఆమె నటిస్తున్న సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. భరత్‌ కమ్మ దర్శకుడు. ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అతడు తన భావాల్ని, ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తైనా, కాకపోయినా ఫర్వాలేదు. కానీ నిజాయతీగా ఉండాలి. అతడి ప్రవర్తన నాకు నచ్చాలి. అన్నింటికన్నా మించి అతడిది మంచి మనస్సై ఉండాలి. అతడితో చాలా సమయం గడపాలని నాకు అనిపించాలి అన్నారు. రష్మిక తన సహ నటుడు రక్షిత్‌ శెట్టిని 2017లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కొన్ని కారణాల వల్ల రష్మిక, రక్షిత్‌ విడిపోయి, 2018 సెప్టెంబరులో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అయితే రష్మిక ఎంచుకుంటున్న కథలు రక్షిత్‌కు నచ్చలేదని, ఆమె సహనటులతో స్నేహంగా ఉండటం ఆయనకు నచ్చని కారణంగా విడిపోయినట్లు వదంతులు వచ్చాయి. కానీ వీటిలో నిజం లేదని రష్మిక స్పష్టం చేశారు.