17వ బెటాలియన్ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌పై భార్య అవంతిక లక్సెట్టిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని శ్రీనివాస్‌ వేధిస్తున్నాడని అవంతిక ఆరోపించింది. ప్రశ్నించిన తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని పేర్కొంది. తమ కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరిస్తున్నాడని, తన భర్త శ్రీనివాస్‌తో నాకు ప్రాణహాని ఉందని అవంతిక ఆవేదన వ్యక్తం చేసింది.