జనతా గ్యారేజ్‌’లో ‘యాపిల్‌ బ్యూటీ, ‘జై లవకుశలో ‘స్వింగ్‌ జరా స్వింగ్‌ జరా’ పాటలతో తెలుగులోనూ పాపులర్‌ అయ్యారు నేహా. ఆమె తనపై లైంగిక దాడులు జరిగాయంటూ షాకిచ్చే విషయాలను బయటపెట్టారు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ: నా జీవితంలో అనేక సార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించడం ఇండస్ట్రీని కుదిపేసింది. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడిస్తూ ఇంటర్వ్యూలో అనేక విషయాలను చెప్పుకొచ్చింది, లైంగిక వేధింపులు నాకు కొత్త కాదు, చిన్నప్పటి నుంచే నేను ఇటువంటి ఎదర్కొన్నాను. పదేళ్ల వయసులో ఓ సారి హరిద్వార్ వెళ్లాను. అక్కడ తొలిసారి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. అప్పుడు నా వయస్సు 10 ఏళ్లు, ఇండియాలోని రిలిజియస్ ప్లేస్ లలో ఒకటైన హరిద్వార్ వెళ్లాను. మా అమ్మ నా దగ్గరలోనే నిలబడి ఉంది. ఈ లోగా హఠాత్తుగా ఓ కుర్రాడు తన వేలుని నా మర్మాంగంలో గుచ్చి పారిపోయాడు నేను షాకయ్యా.!

కొన్నేళ్ల తర్వాత మళ్లీ అదే హరిద్వార్ టెంపుల్ లోనే ఓ యువకుడు వచ్చి నా బ్రెస్ట్ను గట్టిగా పట్టుకున్నాడు. నాకు ఆ సంఘటన బాగా గుర్తుంది. ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. నా తప్పు ఏమి లేకుండానే నా జీవితంలో ఇటువంటి ఘటనలు ఎదురయ్యాయి అని నేహా చెప్పారు. ఇప్పటికీ కొందరు నన్ను సోషల్ మీడియాలో వేధిస్తున్నారు నాకు అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతుంటారు. అక్కడ మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్ గా, స్పిరట్యువల్ గా ఇతరులను వేదిస్తూంటారు. కొందరైతే కామెంట్లు పెడతారు, నా ఒంటి గురించి డ్రెస్సుల గురించి తప్పుడు రాతలు రాస్తారు. అదొక రకమైన టెర్రరిజం దానికి ఫేస్ ఉండదు. వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా, సోషల్ మీడియాలో నాకు ఇటీవల బెదిరింపులు వచ్చాయి, కొందరు చంపేస్తామని హెచ్చరిస్తున్నారు అని చెప్పారు.

సోషల్ మీడియా వేధింపులపై ‘కేందే రేందే’ అంటూ సాగే ఓ ప్రైవేట్‌ సాంగ్‌ను ఆ మధ్యన రికార్డ్‌ చేశారామె. ఆన్‌లైన్‌ ట్రోల్స్, లింగ వివక్ష, బంధుప్రీతి, శరీరాకృతిని విమర్శించడం వంటి అంశాలతో ఈ పాట ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఈ అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ అయినా ఆఫ్‌లైన్‌ అయినా సరే మగవాళ్లు ఇలా ఉండొచ్చు, ఆడవాళ్లు ఇలానే ఉండాలి అనే మనస్తత్వం మారాలి. ఆ మార్పు కోసం నా పాట ఉపయోగపడాలనుకున్నాను. అందుకే ఈ పాట చేశాను’’ అన్నారు నేహా బాసిన్‌. ఒకానొక సమయంలో కే-బ్యాండ్‌కి నేను పెద్ద అభిమానిని కాదు అని చెప్పినందుకు చాలా మంది నన్ను బెదిరించారు. నిన్ను చంపేస్తాము, రేప్‌ చేస్తాం అని ఆన్‌లైన్‌లో నాకు మెసేజ్‌లు వచ్చేవి. వాటితో అలానే ఉండాలని నేను అనుకోలేదు. అందుకే వారిపై ఫిర్యాదు చేశా. ఏ తప్పు లేకుండా ఎవ్వరూ శిక్ష అనుభవించకూడదు. తప్పు లేనప్పుడు వారి వాయిస్‌ని వినిపించాలి” అని చెప్పుకొచ్చారు. తప్పు లేనప్పుడు వారి వాయిస్‌ని వినిపించాలి” అని చెప్పుకొచ్చారు. కరెంట్ చిత్రంలో ‘అటు నువ్వే, ఇటు నువ్వే’ దడ చిత్రంలో ‘హల్లో హల్లో’ ఊసరవెళ్లిలో ‘నిహారిక నిహారిక’ నువ్వా నేనా చిత్రంలో, థ థ తమారా నేనొక్కడినే చిత్రంలో ఆవ్ తుజో మోగ్ కార్టా జనత గ్యారేజ్లో యాపిల్ బ్యూటీ జై లవకుశలో స్వింగ్ జరా పాటను పాడారు, ఆ పాటలు తెలుగులో హిట్ అయ్యాయి.