ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో తెలంగాణ నయగారాగా పేరొందిన బొగత జలపాతం నిండుకుండలా ప్రవహిస్తోంది. గత కొన్ని రోజులుగా బోసి పోయిన బొగత జలపాతం శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. చుట్టు పచ్చని అడవి, ఆ అడవి గుండా ప్రవాహించే వరద ప్రవాహం 50 అడుగుల ఎత్తున బండరాళ్ళపై నుండి పాలధారల జాలువారే జలపాతం తెల్లటి నీటి తుంపర్లు పడుతూ, హోరు శబ్ధంతో జలపాతం తన అందాలతో చూపరులను కట్టిపడేస్తోంది. దీంతో పర్యాటకులు ఈ జలపాతం అందాలను వీక్షీంచేందుకు పలు ప్రాంతల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. బొగత జలపాతం అందాలను వీక్షించేదుకు వచ్చే పర్యాటకులకు ఈ సారి బొగత జలపాతం కొత్త అందాలతో స్వాగతం పలకనుంది.

పర్యాటకుల సౌకర్యార్దం బొగత వద్ద రోప్‌వే, సైక్లింగ్, చిల్డ్రన్స్ పార్క్, బటర్ ప్లై పార్క్, స్విమ్మింగ్ ఫూల్, అడవి అందాలను చురగొనే పగోడాలు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇక్కడి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బొగత వద్ద పర్యాటకులు జలపాత ప్రవాహంలో పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పరాటకులకు ఎప్పటి కప్పుడు సూచనలు చేస్తూ రెస్కుటీం తోపాటు అటవీ సిబ్బంది పర్యవేక్షణ చేయనున్నట్లు ఫారెస్ట్ రెంజర్ డోలి శంకర్ తెలిపారు…