మాతృత్వం స్రీలకు దేవుడిచ్చిన వరం. ఈ మాతృత్వాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్‌గా మార్చేస్తున్నారు బాలీవుడ్ తారలు. మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుకుండేలా ప్రతిక్షణాన్ని పదిలపరుచుకోవాలనే అమీ జాక్సన్ ఆలోచన బాగానే ఉన్నా తన బేబీ బంప్‌ని ఇలా బహిర్గతం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమీ జాక్సన్ 33 వారాల ప్రెగ్నెంట్‌తో ఉన్నట్టుగా ఉన్న న్యూడ్ ఫొటోని షేర్ చేసింది. ఈ సందర్భంగా మాతృత్వంలో ఉన్న మాధుర్యాన్ని నెటిజన్లతో పంచుకుంది. ‘నాలోని మాతృత్వానికి మధుర జ్ఞాపకం ఈ ఫొటో. గర్భం ధరించినప్పటి నుండి నా శరీరంలో చాలా మార్పులువస్తున్నాయి. బరువు పెరుగుతున్నా చర్మం సాగుతుంది వీటన్నింటినీ తట్టుకుంటున్న నా శరీర సామర్ధ్యానికి గర్విస్తున్నా’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు అమీ జాక్సన్. కాగా అమీ జాక్సన్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.