ప్రేమంటే ఏంటి.? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ ఒక్క ఫోటోను చూపిస్తే చాలనుకుంటా, ఈ ఫోటోలో ఉన్నది భార్య భర్తలు. భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడంతో అమె రెండు స్తనాలను తొలగించాల్సి వచ్చింది. అలా స్తనాలు లేని భార్యతో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లలో స్పూర్తిని నింపే ప్రయత్నం చేశారు ఈ భర్త.!అమెరికాకు చెందిన జిమ్ కు ఇద్దరు పిల్లలు పుట్టాక బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. అప్పటి నుండి అనేక ట్రీట్మెంట్లు తీసుకున్నారు.
చివరకు స్తనాలు తొలగించాలని డాక్టర్లు చెప్పడంతో దానికి భర్త అంగీకరించారు. తన భార్య బతికితే అదే చాలనుకున్నారు. ప్రస్తుతం జిమ్ క్యాన్సర్ నుండి అది చేసిన గాయాలనుండి కోలుకుంటున్నారు. క్యాన్సర్ నా నుండి నా శారీరక సామార్థ్యాలను తీసుకెళ్లింది. కానీ అది నా మనస్సును, నా ఆలోచనను, నా ఆత్మస్థైర్యాన్ని టచ్ చేయలేకపోయింది అని చాలా ధైర్యంగా చెప్పుకుంది జిమ్