‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్యామీనన్ ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరవాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, ఆ, సన్ అఫ్ సత్యమూర్తి, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాలలో నటించింది. ఈ మధ్య బాలీవుడ్లో కూడా ‘మిషన్ మంగళ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకుంది. తాజాగా నిత్యా తన 50వ సినిమా కోసం సిద్ధం అవుతుంది. ‘ఆరం తిరు కల్పనా’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుబోతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో విడుదల కానుంది. అజయ్ దేవలోక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతుల వలసలు వంటి విభిన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ కానుంది.