ఓ యువకుడు నిద్రలో నడక అతడికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. నిద్రలో నడుస్తూ తన ఫ్రెండ్ బెడ్‌రూంలోకి వెళ్లిన యువకుడు, అతడి గర్ల్ ఫ్రెండ్ మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, ఆ విషయం తనకు తెలియదని, నిద్రలో జరిగిపోయిందని వాదించాడు. దీంతో ఏం చేయాలో తెలియక జడ్జి తలపట్టుకున్నారు. ఈ ఘటన 2017 ఏప్రిల్‌లో యూకేలో జరిగింది. నార్త్ యార్క్ షైర్‌కు చెందిన డేల్ కెల్లీ, అతడి ఫ్రెండ్, అతడి గర్ల్ ఫ్రెండ్ కలసి ఓ రోజు పార్టీకి వెళ్లారు. అయితే, ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో కెల్లీ నిద్రపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కెల్లీని అతడి రూమ్‌లో పడుకోబెట్టిన స్నేహితుడు, తన గర్ల్ ఫ్రెండ్‌తో కలసి మరో రూమ్‌లో ఉన్నాడు. కానీ, తెల్లారి లేచి చూసేసరికి, కెల్లీ తన స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్‌తో బెడ్ మీద ఉన్నాడు. దీంతో తన మీద లైంగికదాడి చేశాడంటూ కెల్లీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే, కెల్లీకి నిద్రలో నడిచే అలవాటు ఉందని, అది నిద్రలో జరిగిపోయిందని అతడి తరఫున వాదనలు వినిపించిన లాయర్ కోర్టుకు తెలిపారు. కానీ, నిద్రలో నడక పేరు చెప్పి చేసిన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, బాధితురాలి తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో జడ్జికి ఏం చెప్పాలో అర్థం కాలేదు.