12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. లోకేశ్‌ దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య బ్రాహ్మణిపై తనకున్న ప్రేమను ఇలా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’.. ‘అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’.. ‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 2007లో వివాహబంధంతో ఒక్కటైన వీరికి కుమారుడు దేవాన్ష్‌ ఉన్నాడు.