ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూహించెదరో, పాట తెలుసుగా. డెలివరీ బాయ్ కారణంగా తను గర్భం దాల్చాల్సి వచ్చిందని ఓ ముద్దుగుమ్మ కేసు పెట్టింది. అతడు కెండోమ్స్ ను పది నిమిషాలు ఆలస్యంగా తీసుకురావడంతో కోరని కడుపొచ్చిందని వాపోయింది.

చైనాలోని జియాంగ్జు రాష్ట్రంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జూసూకు చెందిన భామ బాయ్ ఫ్రెండును ఇంటికి పిలిచి సరసాల్లో మునిగింది. ఆలస్యం కావడంతో ఇంటికెళ్లొద్దని, తనతో ఉండాలని కోరింది. అతడు కూడా భలే చాన్సులే అని ఈల పాట వేసుకున్నాడు. ముందు జాగ్రత్తగా కండోమ్స్ ప్యాకెట్ కోసం ఆమె ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చింది. 20 నిమిషాల్లో డెలివరీ అవుతుందని యాప్ లో కనిపించింది. అంతవరకు వేచిచూసిన జంట గడువు ముగియడంతో తొందరపడింది. ఇద్దరూ శారీరకంగా కలిశారు.

సృష్టికార్యం ముగిశాక డెలివరీ బాయ్ వచ్చేశాడు. వర్షం కురుస్తోంది కనుక ఆలస్యమైందని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ఆమెకు నెలసరి రాలేదు. టెస్ట్ చేసుకోగా గర్భం వచ్చినట్లు తేలిసింది. దీనికి డెలివరీ బాయే కారణమంటూ అతనిపై కేసు పెట్టింది, అతడు తనకు 3.20 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కోరింది. అయితే బాయ్ దీన్ని తేలిగ్గా తీసుకున్నాడు. తాను పైసా కూడా ఇవ్వనని వాన వల్ల ఆలస్యమైంది కనుక కంపెనీనే ఈ కేసు తేల్చుకుంటుందని చెప్పేశాడు…