మహబూబాబాద్: జిల్లాలో నీళ్లు అవసరం మేరకే నిల్వ ఉంచుకోవాలని అంతకన్నా ఎక్కువగా నిలవ చేసుకుంటే వాటికి రక్షణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పీ గౌతమ్ శుక్రవారం కలెక్టర్ నరసింహుల పేట మండలంలో విస్తృతంగా పర్యటించి డ్రై డే పై ప్రజలకు అవగాహన కలిగించారు. కలెక్టర్ తొలుత తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం డ్రై డే పురస్కరించుకొని నరసింహుల పేట గ్రామంలో పర్యటిస్తూ పంచాయతీ సెక్రెటరీ ఎన్ని ఇండ్లు ఉంటాయని అడుగగా 1185 ఇండ్లు ఉన్నాయని పంచాయతీ సెక్రెటరీ కలెక్టర్ కు తెలియజేశారు.

ప్రతి ఇంటికి వెళ్లి నీళ్ల నిల్వను పరిశీలించారు. నీళ్లు నిలవ ఉంచడానికి గల కారణాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ వచ్చినా వాటిపై గట్టి మూత ఏర్పాటు చేసుకోవాలని దోమలు గ్రుడ్లు పెట్టకుండా చూడాలన్నారు. నిరంతరాయంగా నీటి సరఫరా జరగకపోవడం వలన నిలువ ఉంచు కుంటున్నట్లు ప్రజలు కలెక్టర్ కు దృష్టికి తేగా నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు. ట్యాంక్ నిర్మాణంలో ఉందని పూర్తి కాగానే ప్రతిరోజు నీటి సరఫరా చేయడం జరుగుతుందని మిషన్ భగీరథ ఏ.ఈ. శ్రీలత కలెక్టర్ కి వివరించారు.