తిరుమల: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లు ఉంది ఈ ఫొటోలో అతని వ్యవహారశైలి. సాధారణంగా పురుషులు తమ మెడలో ఒకటో రెండో సన్నపాటి చైన్లు వేసుకోవడం అందరం చూస్తుంటాం. కానీ, ఇతగాడు ఏకంగా కేజిన్నర వరకు బరువు ఉండే దట్టమైన గొలుసులు వేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఇలా మీడియాకు చిక్కాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ బంగారు బాబు తన వివరాలు చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. అందరూ మాత్రం ఇతన్ని ఆసక్తిగా తిలకించారు.