• కాజీపేటలో రైల్వే పీ.ఓ.హెచ్ ఏర్పాటుకు మార్గం సుగమం….
  • పీ.ఓ.హెచ్ ఏర్పాటుకు 200 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని రైల్వే శాఖ కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం…..
  • తాజాగా పీ.ఓహెచ్ ఏర్పాటుకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…

ఈ సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ&మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సంధర్బంగా పీ.ఓ.హెచ్ ఏరాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మంత్రి కేటీఆర్ గారికి వివరించారు. ఇప్పటికే దేవాదాయ భూమిలో పట్టాలు లేకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న స్థానిక రైతులకు ఇప్పటికే నష్ట పరిహారాన్ని అందించినట్లు మంత్రి గారికి గుర్తు చేశారు. పీ.ఓ.హెచ్ ఏర్పాటు పై స్థానిక ప్రజలు, రైల్వే యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు…..