లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత వరంగల్ రైల్వే‌స్టేషన్‌కు ప్రయాణికులతో ప్రత్యేక రైలు రానుంది. నేడు ఉదయం 11:48 నిమిషాలకు ఈ రైలు స్టేషన్‌కు చేరుకోనుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకు వెళ్తున్న ఈ రైలు సుమారు 50రోజుల తర్వాత పట్టాలపై కన్పించనుంది. ఈ రైలులో 85మంది ప్రయాణికులు వరంగల్ స్టేషన్‌లో దిగనున్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి ఇదే రైలులో 138 మంది ప్రయాణీకులు వెళ్లనున్నారు. స్టేషన్‌లో సోషల్ డిస్టెన్స్, స్క్రీనింగ్ కోసం రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.