ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ‘మోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన’ సదస్సులో పాల్గొన్న ఈటల అధికార తెరాస నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల మాట్లాడుతూ: ‘‘నేను పార్టీ మారలేదు తెరాస వాళ్లే వెళ్లగొట్టారు.

పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు తెరాస నేతలు. కేసీఆర్‌కు గోళీలు ఇచ్చేందుకే సంతోశ్‌కు రాజ్యసభ పదవి ఇచ్చారు. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అని అనడం ప్రజలను అవమానించడమే అవుతుంది. బెల్టు షాపులను రాష్ట్రంలో ఎందుకు పెంచుతున్నారు? హైదరాబాద్‌లోని విష సంస్కృతిని బీఆర్‌ఎస్‌ ద్వారా దేశంలో కూడా పెంచుతారా?’’ అని ఈటల నిలదీశారు.