రాబోయే శాసనసభ ఎన్నికల అనంతరం తానూ ముఖ్యమంత్రి కావాలనుకున్నానని ప్రముఖ హాస్యనటుడు వడివేలు తెలిపారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నటుడు వడివేలు గురువారం రాత్రి స్వామి దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ: ప్రపంచ క్షేమాన్ని కాంక్షిస్తూ స్వామి దర్శనం చేసుకున్నానని తెలిపారు. పార్టీకి ఒకరు, పాలనకు ఒకరు అంటూ తన వైఖరిని నటుడు రజనీకాంత్‌ వెల్లడించడం ఆహ్వానించదగిందని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే విషయం ఎవరికీ తెలియదని, ఇంకా చెప్పాలంటే ఆ విషయం ఆయనకే తెలియదని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ విషయం గురించి చూద్దామని పేర్కొన్నారు. ‘2021లో నేనే తమిళనాడు ముఖ్యమంత్రిని’ అంటూ వ్యాఖ్యానించారు.