నేరాల నియంత్రించడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రజలసైతం పరోక్షంగా భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ ప్రజలకు పిలుపునిచ్చారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో నూతనంగా నెలకోల్పనడిన సి.సి. కెమెరాలను పోలీస్ కమిషనర్ హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ప్రారంభించారు. సిటి బస్టాండ్ సెంటర్, కాంగ్రెస్ భవన్ జంక్షన్, అశోక్ హోటల్ జంక్షన్, మాక్సీకేర్ హస్పటల్, ఎసియన్ మాల్, జె.ఎన్.ఎస్ గ్రౌండ్ వెళ్ళే ప్రదాన రోడ్డు మార్గాల్లో హన్మకొండ పోలీసుల పిలుపునందుకోని 30సిసి కెమెరాలను ఎర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎర్పాటు చేసిన సిసి కేమెరాలకు సంబంధించి దృష్యాలను పోలీసులు పరిశీలించే ఈ కెమెరాలను హన్మకొండ సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూం అనుసంధానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ:

నేరాల నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా నిలుస్తాయని, ఒక వేళ నేరం జరిగిన కొద్ది గంటల్లో నేరస్థులను పట్టుకోవడంతో పాటు వారి నేరాన్ని కోర్టుకో నిరూపించేందుకు సిసి కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారయని. గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్రంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలతో పాటు ఇతర నేరాలను చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం ప్రజల భాగస్వాయ్యంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతోనే సాధ్యపడిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, హన్మకొండ ఇన్స్‌పెక్టర్ వేణుమాధవ, ఎస్.ఐలు పిరాజ్ కుమార్, రఘుపతి, జి.రాజ్ కుమార్ తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.