ఓ మహిళ సోషల్‌ మీడియాలో యువకులతో పరిచయాలు పెంచుకుని వారితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న ఓ వివాహిత భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే: కేరళలోని కొట్టాయంలోని న‌రేష్ అనే వ్య‌క్తి త‌న భార్య ప‌ద్మ‌తో నివాసం ఉంటున్నాడు. న‌రేష్ ఓ కంపెనీలో డ్రైవర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్న న‌రేష్‌ పగలు ఇంట్లో ఉండేవాడు. అయితే భార్య ప‌ద్మ సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడిపేది. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో అతిగా చాటింగ్ చేయడం మంచిది కాద‌ని భ‌ర్త ఎంత చెప్పినా, ఆమె మాత్రం వాటిని పెడ‌చెవిన పెట్టేది. అయితే ఇటీవల అదే ప్రాంతానికి చెందిన న‌వీన్ అనే వ్య‌క్తి ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరూ తరుచూ ఛాటింగ్ చేసుకుంటూ వ్యక్తిగత విషయాలు పంచుకునేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది.

నైట్ టైమ్‌లో భర్త ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. దీంతో అనుమానం వ‌చ్చిన న‌రేష్ భార్య‌పై నిఘా పెట్టాడు. ఈ క్ర‌మంలోనే గ‌త వారం ఓ రోజు రాత్రి డ్యూటీకి వెళ్లినట్లే వెళ్లి కాసేపటి తర్వాత సడెన్‌గా ఇంటికొచ్చాడు. బెడ్రూమ్‌ వైపు వెళ్లి కిటికీలో నుంచి చూడగా భార్మ ప‌ద్మ‌, న‌వీన్ ఇద్ద‌రూ నగ్నంగా కనపడటంతో న‌రేష్ ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. వెంటనే ఇద్దరిపై దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. దీంతో న‌వీన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, న‌రేష్ వ‌దిలిపెట్ట‌కుండా ఇద్ద‌రిని కొట్టాడు. అది గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్క‌డ ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అనంత‌రం ప‌ద్మ‌ను, న‌వీన్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.