తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మాడ్చెట్ పల్లిలో జరిగిన ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాడ్చెట్ పల్లి గ్రామానికి చెందిన తాలరి మోహన్(19) కూలీ పనులు చేస్తుంటాడు. ఈ నెల 21వ తేదీన తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఎనిమిదేళ్ల వయస్సు గల బాలికను నోరు మూసి బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. తల్లిదండ్రులు ప్రశ్నించిగా అసలు విషయం చెప్పింది. దాంతో బాలిక తండ్రి బుధవారం పెద్దశంకరంపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.