ప్రియాంకరెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హామీయిచ్చారు. శనివారం ప్రియాంకరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను గవర్నర్‌ ఓదార్చారు. ప్రియాంకరెడ్డి తల్లి విజయమ్మ, చెల్లెలు భవ్యారెడ్డిలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నివిధాల అండగా ఉంటానని భరోసాయిచ్చారు. పోలీసుల వ్యహారశైలిపై గవర్నర్‌కు స్థానికులు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని, ఎఫ్‌ఐఆర్‌ అంటూ తాత్సారం చేశారని ఆరోపించారు. వారు చెప్పిన విషయాలను గవర్నర్‌ ఓపిగ్గా విన్నారు.