అమలా పాల్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ఆడై. తెలుగులో ఆమె పేరుతో రిలీజ్ ఐన ఈ సినిమాలో అమలా పాల్ న్యూడ్‌గా నటించిన సంగతి తెలసిందే . ఇలాంటి సినిమాల‌ వ‌ల్ల యువ‌త చెడిపోతుంద‌ని కొంద‌రు ఆప‌డానికి ప్ర‌య‌త్నించినా కూడా ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత అంతా ప్ర‌శంశిస్తున్నారు. న‌గ్నత్వం ఉన్నా కూడా ఎక్క‌డా అస‌భ్యంగా మాత్రం తెర‌కెక్కించ‌లేదు ద‌ర్శ‌కుడు ర‌త్న కుమార్. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మ‌రో న్యూడ్ సీన్ విడుద‌లైంది. దీన్ని త‌న ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసింది అమ‌లా పాల్. పేప‌ర్ మీద ఇది న్యూడిటీ ఉండొచ్చు కానీ న‌టిస్తున్న‌పుడు మాత్రం చాలా ఆస‌క్తి అనిపించింది అంటూ ట్వీట్ చేసింది అమలా పాల్. మొత్తానికి ఈ న్యూడ్ సీన్స్ చూసిన త‌ర్వాత సినిమాకు మ‌రింత ప్ర‌మోష‌న్ వ‌స్తుంద‌ని న‌మ్ముతుంది ఈ ముద్దుగుమ్మ‌.