పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులతో పాటు, విటులను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1 నవీన్‌నగర్‌లో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్‌్కఫోర్స్‌ పోలీసులు పంజగుట్ట పోలీసుల సహకారంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వ్యభిచారం కేంద్రం నిర్వాహకులు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అక్షయ్‌ అలియాస్‌ వినయ్, అదే ప్రాంతానికి చెందిన సబ్‌ ఆర్గనైజర్‌ ఆర్‌.శృతి, అందులో ఉద్యోగం చేసే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 20 మంది యువతులను కాపాడారు. విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.