ఒక పంతులమ్మ (టీచర్) మంచితనం ఆమె ప్రాణాలమీదకే తెచ్చింది. పోనిలే పాపం అని చేసిన ఒక సాయం ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. నాలుగు మాయమాటలు చెప్పడంతో ఒక యువకుడిని నమ్మి దారుణంగా మోసపోయింది. ఐదేళ్లు ఆ కీచకుడి చెరలో నలిగిపోయింది. చివరికి ఆ కిరాతకుడి ఆగడాలు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. నగ్న వీడియోలను చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదేళ్లలో 15 లక్షలు గుంజిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే: బన్స్‌వారా గ్రామంలో ఓ 39ఏళ్ల మహిళా టీచర్ భర్త చనిపోవడంతో ఒంటారిగా జీవిస్తోంది. ఐదేళ్ల క్రితం ఒకరోజు ఆమెకు ఫేస్ బుక్ నుంచి ముస్తఫా షేక్ అనే పేరుతో ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆమె నాలుగురోజుల తర్వాత ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. ఇక ముస్తాఫా ఆమెతో చాటింగ్ మొదలుపెట్టాడు. తాను ఒక మొబైల్ షాప్ నడుపుతున్నానని, మీ ఫోన్ నెంబర్ మీ మొబైల్ హ్యాక్ అయ్యిందో లేదో అని చెప్తానని నమ్మించి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత చాటింగ్ కాస్తా కాల్స్ కి వచ్చింది.

అప్పుడప్పుడు తన ఆర్ధిక పరిస్థితి బాలేదని చెప్పి ముస్తఫా టీచర్ వద్ద డబ్బు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఆమెను కలిసి తన ఇంటికి తీసుకువెళ్లిన అతను తన భార్య ఇంట్లోలేదని చెప్పి టీచర్ చేత మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె నగ్న వీడియోలను తీశాడు. ఇక నగ్న వీడియోలను చేతిలో పెట్టుకొని టీచర్ ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం ఎవరకైనా చెబితే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించాడు. దాంతో ఆమె పరువు పోతుందని భయపడి సైలెంట్ అయ్యింది. ఇలా ఆ వీడియోలను చూపిస్తూ ఐదేళ్లలో ఆమె వద్ద నుంచి రూ. 10లక్షలు తీసుకోవడమే కాకుండా ఆమెను శారీరకంగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల అతడి ఆగడాలు మరీ శృతిమించడంతో టీచర్ రూ. 5లక్షలు ఇచ్చి ఆ వీడియోలను డిలీట్ చేయాలనీ, తనను వదిలేయాలని తెలిపింది. ఆ డబ్బు తీసుకొన్నాక కూడా అతడిలో మార్పు రాకపోవడంతో టీచర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముస్తఫా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.