వరంగల్ అర్బన్: జిల్లాలో TS-B-PASS ద్వారా భవనాల నిర్మాణాల అనుమతులు త్వరితంగా మంజూరు చేయాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం బల్దియా విసి హాల్ లో లో పట్టణ అధికారులతో టి ఎస్ బి పాస్ విధానం ద్వారా భవనాల నిర్మాణాల అనుమతులు పురోగతిని సమీక్షించి త్వరితగతిన పెండింగ్ లేకుండా పూర్తి చేయుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్ప్రభుత్వ నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇప్పటివరకు నగరవాసులు గృహాల నిర్మాణం కోసం టీఎస్బిపాస్ లో 175 మంది దరఖాస్తులు చేసుకోగా 43 అనుమతులు మంజూరు చేయడం జరిగగిందని, 132 దరఖాస్తులు పరిశీనలో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రణాళిక అధికారులకు మరోమారు టీఎస్బిపాస్ విధానం గురించి పవర్ పాయింట్ ప్రజంటషన్ ద్వారా వివరించి వారిలో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.ఈ సమీక్షలో సిపి నర్సింహ రాములు, ఏసీపీ లు, టిపి ఎస్ లు, టిపిబిఓ లు తదితరులు ఉన్నారు.