జార్ఖండ్‌లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో గల ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు.

వివరాలు: ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ యువకుడు ఆమె తన భార్య అని చెప్పాడు…

దీంతో ఆ యువకులు తమ దగ్గరున్న కుంకుమను ఆ యువకునికి ఇచ్చి, ఆ యువతి నుదుటన పెట్టమని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు తప్పించుకునే మార్గం లేక ఆ యువతి నుదుట కుంకుమ పెట్టాడు. తరువాత ఆ యువకులు… ఆ యువకునితో యువతి ఇంటిలోని వారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పమన్నారు. అయితే ఇంతలోనే సీఆర్‌పీఎఫ్ జవాను అక్కడికి వచ్చారు. జవానును చూసి ఆ యువకులంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు కాలేదు…