కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవిలత. అప్పట్లో నచ్చావులే అంటూ వచ్చిన ఈ బ్యూటీ, నాని స్నేహితుడా సినిమాలో నటించింది.

తెలుగమ్మాయి కావడంతో మాధవికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాలకే కనుమరుగైపోయింది మాధవిలత. మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది ఈమె. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేసారని చెబుతుంది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారని చెబుతుంది మాధవిలత.

నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేసారంటుంది ఈమె. తనకు కూడా ఈ ఇబ్బందులు వచ్చాయని అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది మాధవిలత. అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు తెలిపింది ఈమె. మొత్తానికి పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని చెబుతుంది మాధవిలత…