ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఈయన పేరు హీరోగా సూపర్ స్టార్ గా మంచి టాలెంటెడ్ ఉన్న నటుడిగా జనాలు చెప్పుకునే వాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇచ్చేయడం ఆయనకు నెగిటివ్గా మారింది. అంతేకాదు ఈయన రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు . దీనికి సంబంధించిన విషయాలను ఆయనే ఓపెన్గా చెప్పుకొచ్చాడు.

అంతే కాదు వీళ్ళ కాంబోలో “మళ్లీ పెళ్లి ” అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది, అయితే అప్పట్లో నరేష్ పవిత్రలపై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కాగా ప్రెసెంట్ పవిత్ర చేసిన పని ఇప్పుడు నరేష్ తలెత్తుకునేలా చేసింది అంటున్నారు అభిమానులు. పవిత్ర లోకేష్ రీసెంట్గా తన మాతృభాష కన్నడ సాహిత్యంలో పి.హెచ్.డి చేయడానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసింది .

అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి స్వయాన నరేష్ ఆమెను ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లడం గమనార్హం. ఎగ్జామ్ కోసం ప్రతి రూపాయి కూడా నరేష్ ఖర్చు చేశారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రీసెంట్గా ఈ ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. అయితే పవిత్ర లోకేష్ ఎగ్జామ్లో పాస్ అయింది. అంతేకాదు 910 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 250 మంది మాత్రమే ఈ పరీక్షలో పాస్ అయ్యారు. అంటే ఈ ప్రశ్నలు ఎంత టఫ్ గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఓ టఫ్ ఎగ్జాం ని కూడా నరేష్ కోసం కష్టపడి చదివి పాస్ అయ్యి ఆయన పరువును ప్రతిష్టను నిలబెట్టింది అంటున్నారు అభిమానులు