కుటుంబానికి భారమవుతున్నామని ఇద్దరు యువతుల ఆత్మహత్య, హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో విషాదం నెలకొంది. రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

నగర శివార్లలోని హయత్‌నగర్‌లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాము నివాసం ఉంటున్న గదిలో గౌతమి, మమత సూసైడ్ చేసుకున్నారు. గౌతమి, మమత డిగ్రీ చదువుతున్నారు. పది రోజుల్లో మమతకు వివాహం జరగనుండగా ఈలోపే సూసైడ్ చేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. యువతుల ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలియదు. మమత, గౌతమి ఇద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కి ఉరేసుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. మమత తల్లిదండ్రులు మహబూబ్‌నగర్‌లో వివాహానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు..