జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌ కేసు దేశవ్యాప‍్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు పొలిటికల్‌ లీడర్ల కొడుకులు కావడంతో మరింత చర్చనీయాంశంగా మారిం​ది. ఈ నేపథ్యంలో తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మహమూద్‌ అలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ:

వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగింది. కాబట్టి వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ పదవి తొలగింపు నా పరిధిలో లేదు. అమ్నేషియా పబ్‌లో మైనర్‌పై లైంగిక దాడి కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు అని స్పష్టం చేశారు.