ప్రపంచ చాంపియన్‌షిప్‌ గెలుచుకుని సత్తా చాటిన పీవీ సింధు వరుస పరాజయాలబాట పట్టింది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిన సింధు ఈరోజు జరిగిన కొరియా ఓపెన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది. తొలి రౌండ్‌లో అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌పై 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. మొదటి సెట్ సునాయాసంగా గెలిచి వరుసగా రెండు సెట్లు చేజార్చుకుంది. ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌లో బీవెన్‌ జాంగ్‌పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్‌లో మాత్రం తడబడింది.