రెండవ భార్య చేతిలో రియల్టర్‌ ప్రాణాలు కోల్పోయిన ఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పలార్‌స్వామి అలియాస్‌ స్వామిరాజ్‌ (50)ను బ్యూటీషీయన్‌ కమ్‌ రెండవ భార్య అయిన నేత్ర హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఆరేళ్ల కిందట పెళ్లి వివరాలు: పలార్‌స్వామికి ఇదివరకే పెళ్లయింది. బెంగళూరు ఉత్తర తాలూకాలో లేఔట్లు వేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు.

6 ఏళ్ల కిందట బ్యూటీపార్లర్‌ నడుపుతున్న నేత్రతో వివాహేతర సంబంధం ఏర్పడి తరువాత పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు హారో క్యాతనహళ్లి వద్ద రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. ఆదివారం రాత్రి పలార్‌స్వామిని రాడ్‌తో కొట్టి హత్యచేసిన నేత్ర మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేసానని పోలీసులకు తెలిపింది. అయితే తమను, పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే కోపంతో హత్య చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది. కేసు విచారణలో ఉంది.