పల్లెలను పచ్చదనంతో నింపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎస్సై నిహారిక అన్నారు హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆకినపెళ్లి గ్రామంలో సర్పంచ్ మెట్టు వనమాల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు మొక్కలు పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ప్రధానపాత్ర వహిస్తాయన్నారు. హరితహారం కార్యక్రమం లో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి వాటి రక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రోo టాల రాజేశ్వరి సంపత్, పంచాయతీ కార్యదర్శి కేతిరి ఇంద్రసేన, మెట్టు పవన్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు