జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. శ్రీదేవి వారసురాలిగా వచ్చిన జాన్వీ కపూర్‌ కూడా తల్లి భాటలోనే సినీ రంగ ప్రవేశం చేసి తన తల్లిని గుర్తు చేసేలా తన నటనతో అందరినీ ఆకర్షిస్తుంది. అయితే జాన్వీ తెలుగు సినిమాలోకి ఎప్పటికైనా వస్తుంది అని తెలుగు సినీ అభిమానులు ఊహించినదే అయినా ఎప్పుడు అన్నది మాత్రం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.

అయితే మంచి అవకాశం వచ్చినప్పుడు తప్పక తాను తెలుగులోకి వస్తుందని ఇప్పటికే బోనీకపూర్‌ ప్రకటించారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ సరసన ఫైటర్‌లో నటిస్తుందని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఫైటర్‌లో అనన్య పాండేను తీసుకుంది చిత్రబృందం. కాగా తాజా సమాచారం మేరకు‌ వకీల్‌సాబ్‌‌లో జాన్వీ నటిస్తోందని తెలుస్తోంది. పవర్‌ స్టార్‌కు సౌత్‌లో ఉన్న క్రేజ్‌ సాదారణమైంది కాదు. దీంతో ఆయన సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంని బోనీ కపూర్ భావించాడట.అందులో భాగంగా జాన్వీ వకీల్ సాబ్‌లో నటిస్తోందని సమాచారం. అయితే జాన్వీ ఆ సినిమాలో ఏ పాత్రలో మెరవనుందనేది మాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మిగిలింది.