హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌక్ మైదాన్ లో ఓ ఇంట్లో గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 13 మందికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిని స్థానికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డవారంతా బెంగాలీలుగా గుర్తించారు పోలీసులు.