ఒక కొత్తరకం అమీబా ప్రపంచంలో వైద్యులను ఆందోళనలకు గురి చేస్తోంది. అమెరికాలో పదేళ్ల బాలికకు అత్యంత అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో చనిపోయింది. ఈ అమీబా ఓ స్విమ్మింగ్ పూల్ లో పాప ఈత కొడుతుండగా నీళ్లద్వారా లోపలికి పోయిందని నిర్థారించారు.

ఉదర సంబంధమైన వ్యాధులకు కారణమయ్యే అమీబా, ఇప్పుడు మెదడుని తినేసే అమీబాగా తయారవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిని అనే ఈ బాలిక సెప్టెంబర్ లో తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. ఎంత వైద్యం చేసినా, ఆ పాప పరిస్థితి క్రమేపీ దిగజారిపోయింది. దీంతో ఫోర్ట్ వర్త్ లోని చిన్నపిల్లల ఆస్పత్రికి పంపించి వైద్యం అందించారు.

ఫేస్ బుక్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ కి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు టెక్సాస్ హెల్త్ శాఖ ఆ పాపకు అమిబిక్ మెనిజో ఎన్ సెఫలైటిస్ అనే వ్యాధి సోకిందని నిర్థారించారు. అప్పటికి కాని బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఒకటి ఉందన్న విషయం నిర్థారణ కాలేదు. దీంతో ఇక నుంచి స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొట్టేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.