పారిశుద్ధ్యం పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నడికూడ మండలం కంఠాత్మకూర్‌ గ్రామ సర్పంచి రేకుల సతీశ్‌, ఉప సర్పంచి రాయిడి దేవేందర్‌రెడ్డిపై కలెక్టర్‌ హరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికి నోటీసులు జారీ చేయాలని డీపీవో నారాయణరావును ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, అభివృద్ధి పనుల తీరును కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కంఠాత్మకూర్‌, రామకృష్ణాపూర్‌, ధర్మారం, నర్సక్కపల్లి, చౌట్‌పర్తి గ్రామాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కంఠాత్మకూర్‌ గ్రామంలో బస్టాండు నుంచి గ్రామ పంచాయతీ వరకు బురద నీరు నిల్వ ఉండటంతో ఆగ్రహానికి లోనయ్యారు. పనులపై దృష్టి పెట్టడం లేదా అంటూ సర్పంచి, ఉప సర్పంచిని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.