పాలకుర్తి మండలం బుగ్గ అటవీ క్షేత్రము సమీపంలో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఫ్లైఓవర్ వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం మూగజీవాలను బలి ఇచ్చారు ఆ ప్రాంతం లో కుంకుమ పసుపు లతోపాటు పంది.కోడి, మేకలను బలిఇచ్చీ తల మొండాలను వేలాడదిశారూ.

వివిధ రకాలైనటువంటి మూఢనమ్మకాలకు చెందిన ఆనవాల్లను గురువారం స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తుల ముఠా గుప్తనిధుల కోసం ఈ ప్రాంతంలో బుధవారం రాత్రి తాంత్రికపూజలూ చేశారూ. ఈ ప్రాంతంలో భయాందోళనకు గురి అయ్యే విధంగా పలు రకాల యంత్ర మంత్ర తంత్రాలకు సంబందించిన చిత్రాలను పసుపు కుంకుమలతో చిత్రికరించారూ. ఈ విషయమై జిల్లా సిసిఎస్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు .

మూగజీవాలను ఇవ్వడంతోపాటు భయానకమైన వాతావరణం సృష్టించేలా అక్కడ కార్యక్రమం చేపట్టారు. గతంలో కూడా బుగ్గ క్షేత్రం ప్రాంతంలోగుప్తనిధుల కోసం పలు పలు మార్లు ముఠాలు అన్వేషించి ముగజీవాలను బలిఇచ్చారూ. అదేవిధంగా గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు కూడ గతంలో లభ్యమయ్యాయి. దట్టమైన అటవీప్రాంతమైన ఈ బుగ్గ క్షేత్రం సమీపంలో అసాంఘిక కార్యక్రమాలూ జరుగుతున్నట్లు అక్కడ పరిస్థితులు ఉన్నాయి..