గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బికినీలు ధరించి ఫొటో షూట్లలో తెగ పాల్గొంటోంది. డ్రెస్ ఎలా ఉన్నా క్లీవేజ్ షో మాత్రం అస్సలు తగ్గట్లేదు. తాజాగా ఇలియానా మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో బికినీ వేసుకుని దిగిన మరో ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఆమె గతంలో పోస్ట్ చేసిన ఫొటోలతో పోలిస్తే ఈ ఫొటో పీక్స్‌లో ఉంది. క్లీవేజ్ బాగా కనిపించేలా దగ్గర్నుంచి ఫొటో దిగింది. ‘బికినీ అప్రీసియేషన్ పోస్ట్’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఫొటో చాలా బ్యూటిఫుల్‌గా ఉందని, ఆమె ఫిగర్ సూపర్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తనలో ఇంకా ఆ హాట్‌నెస్ అలాగే ఉందని నిరూపించుకోవడానికి ఈ ఫొటోలు దిగే కార్యక్రమంలో ఉన్నట్లుంది. ఇలియానా తన ఫొటోలను ఆస్ట్రేలియాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో తీయించుకుంటుంది.

దాదాపు మూడేళ్లు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవల మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దాంతో తన ఫొటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠాతో తీయించుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇలియానా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది…