పాకిస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. పిల్లల ముందే తల్లిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి మహిళ వద్ద నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ లోని గుజ్జార్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో అర్ధరాత్రి గుజ్రాన్‌వాలాకు వెళ్తుండగా వాహనంలో పెట్రోల్ అయిపోయింది. తన కారు ఆగిపోయిందని బంధువులకు ఆమె సమాచారం ఇచ్చింది. బంధువుల్లో ఒక అతను పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్లే హెల్స్ చేస్తారని తెలిపాడు.

పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో కారులో భయం భయంగా ఆమె కూర్చుంది. అటుగా వెళ్తున్న ఇద్దరు దుండగులు కారు వద్దకు వచ్చి వాహనం అద్దాలు పగులగొట్టారు. అనంతరం పిల్లల ముందే సదరు మహిళపై అత్యాచారం చేశారు. మహిళ దగ్గర లక్ష రూపాయలు, రెండు ఎటిఎం కార్డులు, కారు రిజిస్ట్రేషన్ పేపర్స్‌తో దుండగులు పారిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐజి ఇనామ్ ఘనీ తెలిపాడు.