అతను ఓ జాతీయ స్షాయి కబడ్డీ క్రీడాకారుడు. కానీ క్షణికావేశంలో అతను చేసిన ఓ పని, అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: మండ్యా జిల్లాకు చెందిన గణేష్, జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు. కాగా.. అతను కాలేజీ సమయంలో నే ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరి ప్రేమ కొన్ని సంవత్సరాలపాటు బాగానే సాగింది. తరచూ ఇద్దరు కలుసుకునేవారు. అయితే, ఇటీవల గణేష్ తన ప్రేయసి వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. అయితే, ఆ ప్రపోజల్ ని యువతి కాదన్నంది. దీంతో, గణేష్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు.

దీంతో కోపంతో ఊగిపోయాడు, ఈ క్రమంలోనే, తాను ప్రేమించిన యువతి.. మరో వ్యక్తిని పెళ్లాడబోతోందన్న విషయం అతనికి తెలిసింది. దీంతో, మరింత కోపంతో ఊగిపోయిన గణేష్, తన ప్రేయసి పై దాడి చేశాడు. కాగా, యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ప్రేయసి పై దాడి అనంతరం, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ ప్రాణాలు కోల్పోగా, ఆమె మాత్రం చావు బతుకులతో పోరాడుతోంది. కాగా, గణేష్ మరణం తర్వాత, అతనితో ప్రేయసి దిగిన ప్రైవేటు ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.