పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ అప్పటికప్పుడు కుప్పకూలి ప్రాణాలు విడిచాడు 19ఏళ్ల ఓ యువకుడు. అతడిని పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో మృతి చెందాడని ధ్రువీకరించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. యంగ్ ఏజ్‌లోనే గుండె పోటుకు గురై మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ఆందోళన వ్యక్తం అవుతోంది. యంగ్ ఏజ్‌లోనే గుండెపోటుకు గురవుతున్న కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు 19ఏళ్ల ఓ యువకుడు. అతడిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మరణించాడని ధ్రువీకరించారు.

పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి పార్డి(కె) గ్రామంలో రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. పెళ్లికుమారుని సమీప బంధువు, మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) ఈ వేడుకకు హాజరయ్యారు. రిసెప్షన్ వేడుకలో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అది గమనించిన మిత్రులు, బంధువులు అపస్మారక స్థితికి చేరుకున్న ముత్యంను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మహారాష్ట్రలోని స్వగ్రామానికి తరలించారు. కళ్ల ముందే మిత్రుడు కుప్పకూలి మరణించడం తోటి మిత్రులను, బంధువులను షాకింగ్‌కు గురిచేసింది.