కరోనా కారణంగా అనుకున్న ముహూర్తానికి వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు సిద్ధపడుతున్నారు. దీంతో తమిళనాడు – కేరళ సరిహద్దు ప్రాంతాలు పెళ్లిళ్లకు వేదికలుగా మారాయి. తమిళనాడుకు చెందిన వరుడు మణికందన్ ను, ముత్తప్పరాజ్, నిర్మల్ రాజ్ లు కేరళకు చెందిన సుకన్య, వేదక్కని, కస్తూరితో లాక్ డౌన్ ముందే వివాహం నిశ్చయమైంది. వారి వివాహం జరగాల్సి ఉండగా లాక్ డౌన్ ప్రకటించడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ..ఈ సారి ఎలాగైనా వారికి పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న సమయానికి వివాహం జరిపించేందుకు కేరళ నుంచి వధువులు తమిళనాడు నుంచి వరుడులు తమిళనాడు – కేరళ బోర్డర్ కు చేరుకున్నారు. బోర్డర్ లోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సుకన్య-మణికందన్‌, వేదక్కని-ముత్తప్పరాజ్‌, కస్తూరి-నిర్మల్‌రాజ్‌ ఒక్కటయ్యారు. దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఈ మూడు పెళ్లిళ్లు జరిగాయి.