టాలీవుడ్ లో రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తొలి సినిమాతోనే మృణాల్ తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసింది. ఈ అమ్మడి నటన, అందం చూసిన ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. కారణం ఈమె ఈ సినిమాలో కట్టు, బొట్టు చూడచక్కని అందంతో చూపుర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే అసలు ఆమె అన్న మాటల విషయానికి వస్తే పెళ్లి కాకపోయినా పర్వాలేదు పిల్లల్ని కనాలని ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ: నా మైండ్ లో ఏం రన్ అవుతుందో అర్థం చేసుకునేవాడు నా భాగస్వామిగా రావాలి అలాంటి వాళ్ళు అంత సులభంగా దొరకరు నాకు పిల్లలను కనాలని వుంది.

అయితే మా అమ్మ ఎంతో సపోర్ట్ ఇస్తారు. నేను పెళ్లి చేసుకోకుండా అయినా సరే నా అండాల్ని భద్రపరచుకొని పిల్లల్ని కంటాను. అంతేకాదు లేదా ఒంటరి తల్లిగా జీవిస్తాను అని ఇదే విషయాన్ని మా అమ్మకు చెబితే ఓకే అని కూడా చెప్పింది అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. కాగా నెటిజన్స్ మాత్రం ఈమెపై ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోకుండానే అండాలను దాచిపెట్టుకొని పిల్లలను కనడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక నిజానికి ఈమెను తన పేరు కంటే సీత అనే పేరుతోనే ప్రేక్షకులు బాగా గుర్తించుకున్నారు. సినిమా విషయానికి వస్తే తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్ నెక్స్ట్ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.