నందికొట్కూరు పట్టణానికి చెందిన చెంచు కాలనీకి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. 25న ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం పెళ్లి కూతురికి పాజిటివ్‌ అని నివేదిక రావడంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. అధికారుల సూచన మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి వాయిదా వేసుకున్నారు. మరోవైపు నందికొట్కూరులో కరోనా విజృంభించింది. ఈ నెల 22న కోటా హైస్కూల్‌ వద్ద 378మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వందమందికి పాజిటివ్‌ వచ్చింది.