సింగర్ సునీత ఈ మధ్య సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగిపోతుంది. కెరీర్‌లో ఎప్పుడూ ఇంతగా ఆమె వార్తల్లో ఉండుండదు. కానీ గత రెండు నెలలుగా ఈమె పేరు మార్మోగిపోతుంది. దానికి కారణం ఆమె రెండో పెళ్లి. దిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈమె మళ్లీ సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫోటో పోస్ట్ చేసింది. సాయంకాల వేళ హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ ఫోటోకు పోజిచ్చింది సునీత. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని సేద తీరుతుంది.

హ్యాపీ కాఫీ టైమ్ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. దాంతో అభిమానులు కూడా ఈ ఫోటోను చూసి నైస్ పిక్ మీరొక్కరే ఉన్నారు తోడు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు అంటే పిల్లలు, తాను మాత్రమే ఫోటోలు షేర్ చేసేది సునీత. కానీ ఇప్పుడు ఈమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. అందుకే సునీతను అభిమానులు కూడా రామ్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేయాలంటూ అడుగుతున్నారు. దానికితోడు త్వరలోనే వీళ్లు హనీమూన్ వెళ్తున్నారు.