పెళ్లి రోజే మాజీ ప్రియుడు వధువు గొంతు కోసి చంపిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని రట్లమ్ జిల్లా జౌరా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: భోపాల్ నుంచి 160 కిలో మీటర్ల దూరంలో షాజాపూర్‌లో సోనూ యాదవ్ రెండో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి సాయంత్రం ఉండడంతో సోనూ తన చెల్లితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. సోన్ పార్లర్ ఉన్నప్పుడు ఆమె లవర్ రామ్ యాదవ్ ఐదు సార్లు కాల్ చేసిన కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో రామ్ తన స్నేహితుడు పవన్ పంచాల్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమెను నమ్మించాడు. ఎక్కడ ఉన్నావో చెప్పాలని అడగడంతో ఆమె అడ్రస్ చెప్పింది. బ్యూటీ పార్లర్‌కు రామ్ చేరుకొని ఆమె గొంతును కత్తితో కోసి అక్కడి నుంచి పవన్ బైక్‌పై పారిపోయాడు. సోనూ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. రామ్‌ను రాజస్థాన్ సరిహద్దులో డ్రాప్ చేసి రట్లమ్ కు తిరుగొస్తుండగా పవన్‌ను పోలీసుల పట్టుకున్నారు.

పవన్‌ను పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం ఓ పెళ్లిలో రామ్, సోనూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపాడు. మూడు రోజుల క్రితం సోనూ పెళ్లి చేసుకుంటుందని తెలియడంతో ఆమెను చంపాలని రామ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం రామ్ పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.