కొత్త జంట. కోటిఆశలతో కొత్త కాపురం ప్రారంభించింది. రెండు నెలల పాటు వాళ్ల సంసారం సజావుగానే సాగింది. ఇంతలో భార్య గర్భవతి అయ్యింది. ఆ శుభవార్తే! వారింట్లో విషాదం నింపింది. పెళ్లయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు, మూడు నెలల గర్భం తన భార్యకు ఎలా వచ్చిందంటూ భర్త అనుమానం పెంచుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఎమ్మిగనూరులో బీరువాలు తయారు చేసే కార్మికుడు మహబూబ్ నివసిస్తున్నాడు. అతనికి అదే జిల్లా ఆదోని మండలానికి చెందిన రజియాబానుకు ఈ సంవత్సరం మే 2న వివాహం జరిగింది. ఇటీవల భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆమెను పరీక్ష చేసిన వైద్యులు గర్భవతి అయ్యిందని తెలిపారు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న మహబూబ్, నిత్యమూ ఆమెను వేధించాడు. ఈ క్రమంలోనే పెళ్లయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు, మూడు నెలల గర్భం తన భార్యకు ఎలా వచ్చిందంటూ భర్త అనుమానం పెంచుకుని. నిద్రిస్తున్న భార్యను గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మహబూబ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమొదు చేసుకొని దర్యాఫ్తు ప్రారంభించారు…