మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. పెళ్లైన అయిదు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కృష్ణప్రియ (24), స్థానికంగా ఉండే శ్రవణ్ కుమార్ ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన పెద్దలు వారిద్దరికి అయిదు నెలల కింద వివాహం చేశారు. ప్రస్తుతం కృష్ణప్రియ అయిదు నెలల గర్భవతి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కృష్ణప్రియ గురువారం ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల వల్లే కృష్ణప్రియ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం అత్తింటి వారే చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కృష్ణప్రియ తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కృష్ణప్రియ భర్త శ్రవణ్ కుమార్, అత్త మీనాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.