ఫస్ట్ నైట్ నుంచి ఆమె భర్త వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెను ఒక్కసారి కూడా తాకలేదట. కొద్దిరోజులు వేచి చూసిన ఆమె స్వయంగా తానే ప్రయత్నించింది. అప్పటికీ ఆమె భర్తలో చలనం రాలేదట. దగ్గరకి వచ్చిన ప్రతీసారి అతడు వేరే గదిలోకి వెళ్లి పడుకునేవాడట. ఇదొక్కటే కాదు ఆడవారిలా మేకప్ వేసుకోవడం, లిప్‌స్టిక్, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకునేవాడట. అతడికి ఇలా ప్రవర్తించవద్దని చెప్పి చూడగా వినడం మాట అటుంచితే ఆమెను పట్టుకుని కొట్టేవాడట. దీనితో విసుగు చెందిన సదరు యువతి తనకు విడాకులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కింది. కాగా, ఈ కేసును విచారించిన కోర్టు తనదైన శైలిలో తీర్పునిచ్చింది. భార్యకు విడాకులు మంజూరు చేయడమే కాకుండా ప్రతీ నెలా రూ. 30వేలు పరిహారంగా చెల్లించాలని భర్త దిలేశ్వర్‌కు ఆదేశాలు ఇచ్చింది.